Saturday, May 19, 2018

vidyullatasavitri.blogspot.com


సావిత్రి-పుడమి తాకిన విద్యుల్లత, నింగి కెగసిన తారాజువ్వ!

పులి పంజా నుండి తప్పించుకున్న లేడి పిల్లలాగా, విహ్వలంగా ద్రౌపది పరిగెత్తుకుంటూ విరాట రాజు విరామ కొలువుకొచ్చి(నిండు కొలువు కాదు సుమీ) భాధతో, కొపంతో, ఉక్రోషంగా ఒకింత దైన్యంగ కీచకుడి బారినుండి కాపాడమని అందర్నీ అర్ధిస్తుంది, అభ్యర్తిస్తుంది....తననుండి ఎవ్వరు కాపాడలేరని కీచకుడు హుంకరించి గుర్తుండాలని ఇంకోసారి బెదిరించి వెళ్ళిపోతాడు. కంకు భట్టనే ధర్మజుడప్పుడు లేచి సైరంద్రిని మందలించి, తిట్టి పదుగురిలో పతులను తూలనాడడమా... చాలించు నీ నాట్యప్రదర్శన అన్నప్పుడు..... సైరంద్రి ఒక్కసారి మొఖమిటు తిప్పి ‘’అవును నాది నాట్యమే, నా భర్తలు నటులు, జూదరులు” అంటుంది. లోకంలోని మొత్తం నిరసన,ఏహ్యము కలేగలిపి పలికించిన అనితరసాధ్యమే కాదు అనూహ్యమైన(కమలాకర కామేశ్వర రావు ఊహించి ఉంటాడా, అహా ఉంటాడాని) భావం....చెంప చెల్లుమన్నట్లు ధర్మజుడనే మిక్కిలినేని నిలువునా కుంగిపోతాడు! నిజమైన ద్రౌపది ఎంతలా, ఎట్లా నిరసిన్చిందో గాని ఈ అభినవ ద్రౌపది చూపులకు పాండవులే కాదు చాటుననున్నమేరునగదీరుడు ఎస్.వి. రంగారావు కూడా డంగైపోవాల్సిందే! సినిమా నర్తనశాల అనే వేరే చెప్పాలా?

రెప్పపాటున  కనురెప్పలమాటున కావ్యాలు పలికించగల విదుషీమని, మాటలకందిన భావాలు, మాటలకందని భావాలు కూడా సహజంగా, మనోజ్ఞంగా,అధ్బుతంగా పలికించగల అభినేత్రి, గొంతులోని అర్తితో రాయినైన కరిగించగల కరుణశ్రీ, అన్నీటిని మించి సాటి వారికోసం సర్వం అర్పించగలిగిన మహామనిషి, మానవతామూర్తి ‘sui generis’ సావిత్రి! ఈ చరాచర విశ్వంలో ఒకటి పోలి ఇంకోటి ఉండవచ్చు....కాని సావిత్రి మాత్రం ఒక్కటే! ఆచంద్రతారార్కానికి అర్ధం సావిత్రే, నభూతో నభవిష్యతి నిలువెత్తు ఉదాహరణ సావిత్రే! సినిమాలో నరేష్ అన్నట్లు సావిత్రి ఎవరు సావిత్రిగారు మాత్రమె తనకు తెలుసు అనేది missing a crucial point.....తల్లి బిడ్డలా వాత్సల్యం లాగ, తాదాత్మ్యం చెందిన భక్తుడు భగవంతుని బంధంలాగా, గారు గీరులతో సంబందంలేని అవ్యాజ అనురాగ బంధం కోటానుకోట్ల అభిమాన భక్తులకి  సావిత్రమ్మకి!

అసలీ ఉపోద్ఘాతం నా/నాలాంటివాళ్ళ ఆరాటం, వర్ణించలేని స్పందనలను, అనుభూతులను చెప్పాలనే పిచ్చి తపనే కాని.....మాటలకందుతుందా సావిత్రమ్మ? అరుదైన వ్యక్తీ అనీ అనలేం...దానర్ధం ఇంకొందరుంటారని కదా! దాసరి పూనినట్లు చర్విత చరణం......వినువీదిలోను, విశ్వాంతరంలోను సావిత్రి ఒక్కతే!
నేను ఫిఫ్త్ లో ఉన్నప్పుడు కావొచ్చు దూరదర్శన్లో ‘దేవదాసు’ వచ్చింది. మా ఇంట్లో సినిమాలు నిషిద్ధం అనే ముందే విన్నవించుకున్నాం కదా, మంచివి కూడా! నేను యధావిధి గల్లీలతోపాటు పాల(తేవడానికి) ప్రస్థానము చేయుచుండ, దేవదాసు నా కంట బడ్డాడు....కొందరు టివీ ఓనరులు కొంచెం ఇహం పరం తలచి పాదాచారులపై కనికరించి సత్య పీటాలని బయటకు కనేపడేటట్లు పెట్టేవారు...జంతు దయ లాగ  టివీ దయ అన్నమాట! అప్పుడు ఆఖరి సీనోస్తుంది, క్లైమాక్స్ అంటారని తెలియదింకా, దేవదా దేవదా  అని సావిత్రి జమిందారి బంగ్లానుండి తూలుతూ పరిగెత్తుకుంటూ వస్తుంది.....తలుపలెయ్యండని సి.ఎస్.ఆర్ అంటే తలుపులు దబాల్న పడడం సావిత్రి తలకొట్టుకోవటం, పడిపోవడం నా గుండెలు బద్దలౌవ్వడం ఒకేసారి జరిగిపోయినవి......అయ్యో దేవుడా సావిత్రి ఎందుకు చచ్చిపోవాలే, ఎందుకు.....కథను మార్చలేరా సావిత్రిని బతికించలేరా అని కుళ్ళి కుళ్ళి ఏడ్చిన....కొన్ని రోజులవరకు గుండెలనిండా వ్యాకులమే! చిన్నా, పెద్దా, పిల్లా, పాపల తేడాలేకుండా సరాసరి గుండెల్ని తాకగలగడం ఒక్క సావిత్రమ్మకు తప్ప ఎవ్వరికి సాధ్యం! దేవదాసులో అక్కినేని అద్భుతంగా నటించినప్పటికీ నాకు మాత్రం కేవలం పదిహేడేళ్ళ వయస్సుల్లో ఆ పాత్రలో జీవించి, శరత్ ఊహలమించి అవిష్కరించిన సావిత్రమ్మే చెరగని ముద్ర వేసింది. సాధారణంగా పురుషాధిక్య సమాజం, సినిమా ప్రపంచంలో ఇంకెక్కువ, దేవదాసంటే అక్కినేనని చలామణి అయ్యిందేమో....కాని సాక్ష్యాత్తు అక్కినేనికే తెలుసు పార్వతి ముందు దేవదాసు ఉత్త దుడుకేనని!

దేవదాసు టి.వి లో వచ్చిన కొన్ని రోజులకే కావొచ్చు మా పెద్దన్న సీతార పత్రిక  తీసుకొచ్చిండు.....అదీ మూడో ప్రపంచయుద్ధమంత మంతా షాక్....అన్నేంది సీతార తేవడమేందని.....దాంట్లో నింగి కెగసిన తార అనే ఆర్టికల్ సావిత్రమ్మ మరణం గురించి....గుండెలు వ్రయ్యలవ్వటం అంటే తెలిసొచ్చింది. ఇల్లంతా దు:ఖమే......మన పెద్ద నటులందరి పైన పిచ్చి కోపం, ముఖ్యంగా జెమినీ గణేసన్ ఆరోజు దొరుకుతే నిజంగా చంపాలనిపించింది! How could you do this Savitri, how could you not help her, how could you let her die like that.....ఈ ప్రశ్నలు అప్పటినుండి ఇప్పటివరకు నన్ను వదల్లేదు, వెంటాడుతూనే ఉన్నాయి....సావిత్రమ్మను తలచుకొని భోరు భోరు ఏడ్చిన సందర్భాలు ఎన్నో.....How could an actress have such a profound impact that can be rationally explained? దానికి చాల వరకు సమాధానం పల్లవి గారి అధ్బుతమైన ‘మహానటి సావిత్రి-వెండితెర సామ్రాజ్ఞి’ పుస్తకంలో దొరికింది. సావిత్రి లాంటి వ్యక్తులు ఉండడం సాధ్యమా.....అదీ సినిమా లాంటి కృత్రిమ, బేషజాల, మోసపూరిత, వంచించే ప్రపంచంలో? సావిత్రమ్మ సినిమా వెనుక జీవితం తెలిసేకొద్దీ అంతులేని దు:ఖం, అంతకన్నా ఎక్కువ గౌరవం, ప్రేమ పెరిగింది. తను మోసపోతున్నది, మోసంచేస్తున్నది ఎవరో తెలియనంత అమాయుకురాలు కాదు సావిత్ర్రమ్మ, అద్వితీయమైన కళాకారినే కాదు అత్యంత ప్రజ్ఞాశాలి.....అన్నీ తెలిసీ తన తత్త్వం మార్చుకోకుండా, అడిగినవారికి, అడగనివారికి తన సర్వస్వం ధారపోసిన మానవీయ మూర్తి! తెలివిగా, ప్రాక్టికల్గా, సుఖంగా బతక నేర్చింది కాదు సావిత్రమ్మ, బతుకుకే కొత్త భాష్యం చెప్పిన మహామనీషి?

మళ్ళీ ‘Legendary Actress: Mahanati Savitri పుస్తకం పబ్లిష్ అయినప్పుడు ఆత్రంగా చదివాను....దేశం వొదిలి కొన్ని దశాభ్దాలై ఎక్కడో అమెరికా లో ఉంటున్న వ్యక్తిని, ఇండియా కి రప్పించి, రీసర్చ్ చేయించి తనపైన పుస్తకం రాయించే శక్తి ఒక్క సావిత్రమ్మకే ఉందని మురిసిపోయాను. అప్పుడే ఎవ్వరైనా సావిత్రమ్మ పైన ఒక authentic సినిమా తీస్తే బాగుండనిపించింది....అమ్మో చండాలం చేస్తే భరించలేనని భయపడ్డాను కూడా! సావిత్రమ్మను casual గా కూడా ఎవరైనా ఏమైనా అంటే అస్సలు భరించలేను!

కాని ఎవడే సుబ్రహ్మణ్యం తీసిన నాగ్ అశ్విన్ ‘మహానటి’ తలపెట్టాడని తెలిసి సంతోషపడ్డ....ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన....ఇంటర్వూస్, ఆడియో లాంచ్ మల్లీ, మల్లీ చూసి అందరు సావిత్రమ్మ గురించి మాట్లాడుకుంటే గొప్పగా ఫీలైన! ఇంకా విడుదలైన రెండో రోజే అర్ధరాత్రి షో కి ఇంటిల్లి పాది వెళ్ళినం.....మా పిల్లలు తరవాతి రోజు స్కూల్ పాయె, నా ఆఫీసు పాయె! Anyways that’s a very small price to pay…...సినిమా విషయానికొస్తే బాగనిపించింది కాని గొప్పగా అనిపించలేదు. సావిత్రమ్మను అనునిత్యం కలవరించే నాకు/నా లాంటి వాళ్లకు కొత్త విషయాలేం కనిపించలేదు.....except for a deeply romanticized portrayal of Gemini Ganesan! విజయ చాముండేశ్వరి గారి ఎన్నో ఇంటర్వూస్, సతీష్ గారి కొన్ని ఇంటర్వూస్ చూసిన తరవాత స్పష్టమైన విషయమేమంటే....స్క్రిప్ట్ విషయంలో, ముఖ్యంగా జెమినీ గణేసన్ చూపెట్టడంలో, చాల ఆంక్షలు విధించారని. ఏ పిల్లలు తమ తండ్రిని విలన్ గా చూపించుకోవాలని కోరుకోరు.....కాని ఇది బయోపిక్. 

One is allowed to reinterpret the events of the past but not alter facts! Ashwin should have followed Shyam Benegal’s unforgettable ‘Bhoomika’ style of narration of not straying from truth. Gemini Ganesan’s portrayal as debonair, deeply romantic, well-meaning person is not only misleading but downright deception. పదహారేళ్ళ వయస్సుల్లో ఒక బాగా చదువుకున్న, ఆకర్షణీయమైన వ్యక్తీ ప్రేమలో పడడం సావిత్రికి సహజమే.....ఒక రకంగా వాళ్ళ పెద్దనాన్న కట్టడిని, exploitation ని ప్రతిఘటించే కోణం నుండే చూడాలి, అర్ధం చేసుకోవాలె. సదరు పెదనాన్న వివరాలు పల్లవి గారి పుస్తంలో చదవండి! ఇంకా మన కాదల్ మన్ను మశానం జెమినీ గణేసన్....పెళ్లి ఇదివరకే అయ్యిందని, పిల్లల్లున్నారని, ఇంకా సంబంధాలున్నాయని అయినా నీ వోక్కదాన్నే నిజంగా ప్రేమిస్తున్నానడం pure fiction. It’s unfortunate that Dulquer’s brilliant portrayal almost makes one convinced that Gemini had no faults except having multiple wives and partners!
సావిత్రమ్మ ప్రేమించడం ఎంత నిజమో, జెమినీ trapping a vulnerable, even impressionable girl అంతే నిజము. There’s no glossing over the fact that Gemini was a manipulative philanderer as the later history so conclusively proved!  దురదృష్టం ఏమంటే సావిత్రమ్మ మాత్రం స్వచ్చంగా, జీవితాంతం అంతే వివశంగా, తన్ను తానూ నాశనం చేసుకునేంత ప్రేమించింది....కాని జెమినీ సావిత్రిని పెళ్ళాడిన తరవాత కూడా మొదటి భార్యతో పిల్లలు కన్నాడు, పుష్పవల్లితో బంధం సాగించాడు, పెరుకెక్కని ఏంతో మందితో సంబంధాలు. మరదే కాదల్ మన్ను మశానం!

గుమ్మడి గారి మాటల్లోనే సావిత్రమ్మ కొన్ని వందల కోట్లు(ఇప్పటి లెక్కల్లో) సంపాయించింది..... అక్షరాల జెమినీ కంటే కొన్ని వందల రేట్లు ఎక్కువ సంపాదించింది and got the very best of everything for him(clothes, shoes, cars) to make him happy! జెమినీ మాత్రం సావిత్రమ్మ డబ్బును విచ్చలవిడిగా వాడుకొని, తాగుడు నేర్పించి, ఆరోగ్యం నాశనమైతుందని తెలుస్తున్నా అస్సలు పట్టించుకోక కొత్త, ఇంకా కొత్త  జీవితాన్నే విలాసాన్నే వెతుకున్నాడు....ఇది పచ్చి నిజం. అమ్మాడి సంపాదన మీద ప్రేమ అమ్మాడి పైన ఎక్కడ ఎప్పుడు చూపెట్టాడో ఆ దేవుడికి కూడా తెలియని రహస్యం.

సావిత్రమ్మ జేవితంలో విషాదాన్ని చూపెట్టొద్దు only let’s celebrate her glorious life అనే దృక్పథం అమాయకత్వమే అవుతుంది ఇంకా మోసం అవుతుంది. సావిత్రమ్మ తను బతికినా 46 సంవత్సరాలలో మూడో వంతు తీవ్రమైన వేదన, భరించరాని భాద అనుభవించింది.....ఎవరి వల్ల? కేవలం తన మొండితనం వల్ల జీవితం దుర్భరమైనట్లు చిత్రించడం శుద్ధ అబద్దమే  కాక అన్యాయం!

సావిత్రమ్మ కోమాలోకి వెళ్ళినప్పుడు కూతురిగా తను ఎం చేసిందనే విషయాలపై విజయ చాముండేశ్వరి గారు కూడా ఎప్పుడు సూటిగా సమాధానం ఇవ్వలేదు, తన భాద్యత పై కూడా ప్రశ్నలు ఉదయిస్తాయనే భావనతో తప్పించుకున్నట్లే అనిపిస్తుంది. సావిత్రమ్మ గతించిన తరవాత పిల్లలిద్దర్ని జెమినీ బాగా చూస్కున్నాడనే వాదం హాస్యాస్పదమే....డబ్బులన్నీ, ఆస్తులు సావిత్రమ్మవే.....ఇంకా చెప్పాలంటే అలమేలు పిల్లల పెళ్ళిళ్ళు కూడా సావిత్రమ్మే చేయించింది. ఏ కోణం నుండి చూసినా, ఎంత వాస్తవిక దృష్టితో ఆలోచించినా సావిత్రమ్మ సర్వ నాశనానికి జెమినీ ప్రధాన, ఇంకా వాదిస్తే, ఒక్కటే కారణం. No two ways about it! Gemini’s behavior towards Savitramma is a criminal dereliction of duty at a simple human level forget about proclamations of true love for ‘Ammadi’. ఇంకా ఇప్పుడు మహానటి తమిళనాట రిలీజ్ అయినాక అలమేలు బిడ్డలు సావిత్రమ్మే ఇలాంటిది, అలాంటిది అంటుంటే ఇంకా మన:స్తాపం కలుగుతుంది.

Ashwin was bold and sincere enough to undertake the massive task of telling Mahanati Story but apparently not bold enough to tell the absolute అండ్ unvarnished truth. ఇంకా సినిమా గురించి చర్చించాలంటే ఎక్కువగా చెప్పుకుంటున్న పాటలు....ఎక్కువ ఫోకస్, ప్రాధాన్యత సావిత్రమ్మ గొప్ప పాటలని పూర్తిగా recreate చేయటంలో పెట్టినట్లు కనిపిస్తుంది. చాల కస్టపడి, ఏంతో ప్రతిభావాంతంగా తీసినప్పటికీ నాకు మాత్రం….when you have the original, why watch the copy అనిపించింది. కీర్తి సురేష్ ఎంతో బాగ నటించింది కాని అన్నమయ్య అన్నట్లు ‘నరహరి కీర్తన నానిన జిహ్వ బరుల నుతింపనేరదు జిహ్వ’ సావిత్రమ్మను గాంచిన కన్నుల్లు ఒరుల గాంచను నోపవు కన్నుల్లు అనిపించింది. అట్లా కాకుండా ఒక ‘అహనా పెళ్ళంట’ పాట వరకు పూర్తి స్తాయి పునఃసృష్టి పరిమితం చేసి ఇంకా లోతుగా off the screen events పైన ఫోకస్ చేసి మహానటిగా నిజమైన ప్రస్తానం చూపెడితే ఇంకా అధ్బుతంగా ఉండేది. There’s an absolute wealth of material and information available on Savitramma to narrate the story of her emergence and evolution into perhaps the greatest actor ever! How did other great directors, actors, peers view her (without recreating the actual movie scenes), her impact on the industry itself, her unstinting magnanimity and absolute unanimity on the spellbinding quality of her ethereal talent. One could have powerfully and coherently interwoven many events that speak to her incomparable acting skills and magical spell on box-office.

ఎంత గొప్ప సిసిమానైన, ఎంత గొప్పగా తీసిన అసలైన సావిత్రమ్మకు న్యాయం చేయగలరా? మాయాబజార్ పాద పీడనం(భళా పింగళి) సీన్లో  రేలంగి లబ లబ లాడి చంపెసావంటే ‘మరి ఆర్య కుమారులు మాత్రం తోక్కోచ్చునే’ అని కొంటేదనము, గడసుదనము, ఆటపట్టించడం మేలవించిన అత్యత్భుత నటన ఎవరికీ సాద్యం? దీనికి తప్పకుండ కే.వి. రెడ్డి గారు చకితులై ఉంటారు. ఇంకా ఎస్.వి. ఆర్ను అనుకరిస్తూ.....’ఇంక మనది మాత్రము సోదర ప్రేమే’ అనడం చూసి అభిమన్యుడు ఖంగు తిన్నాడో లేదో కాని అక్కినేని మాత్రం అవాక్కైనట్లు ఖచ్చితంగా అనిపించింది. మిస్సమ్మ లో తెలుసుకొనవె చెల్లి పాట కొనసాగింపుగా NTR రాగమెత్తుకుంటే.....మీరూ పాడగలరా అనే వెక్కిరింపు నుండి అబ్బో బాగా పాడుతున్నారె అనే భావం అర క్షణంలో కన్నుల వెలుగులో పలికిస్తుంది....సావిత్రమ్మ కన్నులు కావ్యాలు పలికించడం అతిశయోక్తి కాదు!  సావిత్రమ్మ నటన మనం గొప్పగా చూడం ....మురిపెంగా,ఉద్విగ్నంగా,వివశంగా, మమేకమైయ్యి చూస్తాం. అట్లే అర్దాంగిలో జగ్గయ్యతో ఘర్షణ సీను....’ఆగండి, అరకలిప్పుతార, రైతు బొందిలో ప్రాణం ఉండగానే మర్యాదగా వెళ్ళండి’ అని కొంగు ఝలిపించి అపర కాళి మనోహరంగా ఉంటె ఇట్లానే ఉండునెమో అనిపిస్తుంది.....తోటి హీరోలు కూడా సీటిలు కొట్టాలనిపించేదేమో!

ఆదుర్తి తోటికోడల్లు సుశీల....పాత్రవరకు సినిమాలో అందరికి హడల్....సావిత్రమ్మ సీనులో ఉంటే ఇంకెవ్వరు కనపడరు except the equally marvelous SVR! ‘అయితే అక్కా మీ అందరకి నేను బ్రహ్మ రాక్షసిలాగా కనిపిస్తున్నాన? కన్నాంబ ’ఎంత మాటన్నావే....నా బంగారు తల్లి, అన్నపూర్ణ’ అంటుంది....చూస్తున్న మనమూ కన్నాంబలాగే భావోద్వేగం,ఆనందాతిశయం, వాత్స్యలంతో ముప్పిరి గొని ఉక్కిరి బిక్కిరవుతాము. అన్నిటిని మించి సావిత్రమ్మ అత్యంత మనోహరంగ కనిపించి, లలితంగా నటించి, మూతి బిగింపే ఒక landmark చేసిన కోలు కొలయమ్మ పాట, గుండమ్మ కథ ఆద్యంతము ఆహ్లాదమే, ఉల్లాసమే! అమాయకంగా సవతి తల్లితో తిట్లు, శాపనార్ధాలు తింటూ మల్లీ ఇంటికొచ్చినప్పుడు సూర్యకాంతం పరిస్తితి చూసి చలించిపోయే సన్నివేశం, దైర్యం చెప్పి కొట్లాటకి తీస్కురావడం....’నువ్వేవరె కూతురా’ అని ఛాయా దేవి దీర్ఘం తీస్తే, ‘ఉం అమ్మ కూతుర్ని’ అనడం, ఇవి పిడకలు చేసిన చేతులు అంటే ఇవి జొన్నలు దంచిన చేతులు అని కట్టేని విరగొట్టి రెండుముక్కలు చేయయడం.....లక్ష సార్లు చూసి అన్నే సార్లు సీటీలు కొట్టొచ్చు. ఇట్లా చెప్పుకుంటే పోతే ఎన్నో ఎన్నెన్నో.....సావిత్రమ్మతో మమేకమైతే ఎన్ని అనుభూతులు, అనుభవాలు, ఎన్ని శిఖరాగ్రాలు, ఎన్ని అధ:పతనాలు.....సావిత్రమ్మను వేరు చేసి ఒక నటిలాగానో, ఒక వ్యక్తిలాగానో చూడలేము.....మనము ఆ తల్లితో మమేకమవ్వల్సిందే, ఆమె ఆనందమంతా అనుభవించాల్సిందే, ఆమె దు:ఖం దు:ఖించాల్సిందే, ఆమె ఆటలు ఆడాల్సిందే, ఆమె పాటలు పాడాల్సిందే. సావిత్రమ్మ ఒక మనిషి కాదు, ఒక నటి కాదు.....అదొక అద్భుతమైన ఊహ....అందులో కోటి భావాలు, లక్ష్య సంఘర్షణలు, లిప్తలో మోదం మరు లిప్తలో ఖేదం, ఘనీభవించిన స్మృతులు, మన మనస్సులని మస్తిష్కాలని పట్టు దారంలాగా ఆవరించిన మూర్తి, మన గుండె లోతుల్లో వినిపించే ‘ఎక్కడమ్మా చంద్రుడు’    

సావిత్రమ్మ చిన్న వయసులోనే విషాదంగా చనిపోయిందనే భాద ఎప్పటికి తొలుస్తూనే ఉంటుంది కాని ఎన్ని సంవత్సరాలు బతికిందనే దాని కన్నా ఎట్లా బతికింది, ఎందరిలో బతికింది, ఎందరిలో ఇంకా బతుకుతుంది మానవాళి ఉన్నంతవరకు సజీవంగానే ఉంటుంది అనే ఎరుక మననంలోకి వచ్చినంక ఒక అనిర్వచనీయమైన తృప్తి, సేద తీరిన  ఆనందం అన్నిటిని మించి ఒక ఘాడమైన కృతజ్ఞత అలుముకొంటుంది.
పుట్టుక నీది, చావు నీది నీ జీవితమంతా మాదేనమ్మా!

అమ్మా నువ్వు పుడమిని తాకిన విద్యుల్లతవే....ఆ వెలుగులలనే నిన్ను కంటాము, వింటాము, కనువిందు చేస్కొంటాము! విశ్వం ఒక్కటే, సావిత్రి ఒక్కతే!    

No comments:

Post a Comment

vidyullatasavitri.blogspot.com

సావిత్రి-పుడమి తాకిన విద్యుల్లత, నింగి కెగసిన తారాజువ్వ! పులి పంజా నుండి తప్పించుకున్న లేడి పిల్లలాగా, విహ్వలంగా ద్రౌపది పరిగెత్తుకుంటూ ...